ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడమే జగన్ లక్ష్యమని, ఆయన కుట్రలో ప్రజలు భాగస్వాములు కావద్దని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. రెండున్నరేళ్ల పాలనా కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ. 2లక్షల 60వేల కోట్ల పెట్టుబడులను గ్రౌండ్ చేయించి 3లక్షల 61వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిందని తెలిపారు. మొత్తం 927 పారిశ్రామిక యూనిట్లకు ఎంవోయులు కుదుర్చుకుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాలేని పెట్టుబడుల ఆకర్షణలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. రిజర్వ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నివేదికలు దీన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని, కొరికే చలిలో దావోస్‌లో చంద్రబాబు బృందం చేసిన కృషి ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు. ఇంతటి విజయానికి కారణమైన దావోస్ వెళ్లొచ్చిన చంద్రబాబు బృందంపై బురద చల్లడం, హేళన చేయడం జగన్ రాజకీయ అసూయకు నిదర్శనమన్నారు. విశాఖ పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు ముందురోజు జగన్ విశాఖలో అలజడి రేపడం పెట్టుబడులను అడ్డుకొనేందుకేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా అనే పేరు కోసం వచ్చే ఈ ప్రాజెక్టులు, నిధులు పోగొట్టుకోవడం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. అలజడులతో రాష్ట్భ్రావృద్ధిని దెబ్బతీయాలనేది జగన ఏకైక కోరికన్నారు. వైఎస్, పదేళ్ల కాంగ్రెస్ పాలనా కాలంలో లక్షా 5వేల పరిశ్రమలు మూతపడి 11 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు వీరి కుట్రలను, దుష్ప్రచారాలను నిరసించాలన్నారు. ప్రతిపక్షాల కుట్రల వలలో పడకుండా అత్యున్నత చైతన్యం ప్రదర్శించిన ఆంధ్ర రాష్ట్ర యువతరం దేశానికే ఆదర్శమని మంత్రి రఘునాథరెడ్డి ప్రశంసించారు.