ఆంధ్రప్రదేశ్‌

అరాచకం సృష్టిస్తే ఊరుకోం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 26: ప్రశాంతతకు నిలయమైన విశాఖపట్నంలో బందులు, రాస్తారోకోలకు పిలుపునిచ్చి ప్రశాంతతను భగ్నం చేయటం తగదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. గురువారం నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా అడ్డుకునేలా వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో బందు లు, రాస్తారోకోలను పిలుపునివ్వడం, కొవ్వొత్తుల ప్రదర్శనకు పార్టీ నేతలకు పిలుపునివ్వడం వంటివి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి అనేక నిధులను తెస్తున్నారని గంటా చెప్పారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు కేం ద్రమే నిధులన్నీ ఇచ్చేలా కృషి చేస్తున్నారన్నారు. శుక్రవారం నుంచి విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రశాంత వాతావరణాన్ని విఛ్చిన్నం చేయడానికి కాగడాల ర్యాలీలు, దీక్షలు చేయడం తగదన్నారు. ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు విశాఖ చేరుకున్నారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరించి ప్రవర్తించడం తగదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ము ఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఈలోపు రాష్ట్భ్రావృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాను సాధించాలంటే ప్రధాని మోదీతో మాట్లాడాలని, కానీ జగన్ ఢిల్లీలో ధర్నాలు చేయకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట్లాడే దమ్ము, ధైర్యం జగన్‌కి లేవని విమర్శించారు. దీంతో జగన్ నైజం బయటపడిందన్నారు. రాష్ట్రం లో దీక్షలతో ఆరాచకం సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.