ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ చట్టాలపై అవగాహన కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: విద్యుత్ వినియోగదారులకు వారి హక్కుల గురించి చైతన్యపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి , ఏపి లీగల్ సర్వీసస్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ శనివారం విజయవాడలోవిద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చట్టాలపై చైతన్యం కల్పించేందుకు కార్యక్రమాలను చేపట్టననుంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ హాజరవుతారు. ఈ వివరాలను ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. విద్యుత్ చట్టాలను ప్రజలకు వివరించేందుకు జిల్లా మండల స్ధాయిలో కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపి డిస్కాంలకుచెందిన అధికారులు ఈ కమిటీ నిర్వహణలో భాగస్వామ్యం చెందనున్నట్లు చెప్పారు.