ఆంధ్రప్రదేశ్‌

హాస్టళ్లలో నిద్రించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు నిద్రించి విద్యార్థులతో మమేకం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట్ర కార్యాలయంలో చంద్రన్న సంక్షేమ హాస్టళ్ల సముద్ధరణ పేరిట టిఎన్‌ఎస్‌ఎఫ్ రూపొందించిన గోడపత్రికను లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అందాల్సిన సదుపాయాలు, వౌలిక వసతులు, సిబ్బంది, భవన సదుపాయాలను, భోజన వసతి, కాస్మోటిక్స్, దుప్పట్లు, వైద్య పరీక్షలు, స్టడీ అవర్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో సమస్యల్లేని సంక్షేమ హాస్టళ్లుగా రూపుదిద్దాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ఇప్పటికే రెండవసారి పెట్టుబడిదారుల సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించకపోగా, చంద్రబాబునాయుడు దేశ, విదేశాలు తిరిగి రాష్ట్రంలోని యువత భవిష్యత్ కోసం పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని కూడా అరాచకవాదులు చేస్తున్న ప్రయత్నాలను విద్యార్థులకు వివరించే బాధ్యత టిఎన్‌ఎస్‌ఎఫ్ తీసుకోవాలన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా వచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అవగాహన కల్గించాలన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎక్కడా రాజీ పడకుండా, అధైర్యపడకుండా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతోందన్నారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా మన నాయకుడు చంద్రబాబునాయుడు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు.