ఆంధ్రప్రదేశ్‌

జిఎస్‌ఎల్‌వి-మార్క్3 పరీక్ష సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 27: భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు చేస్తున్న ప్రయత్నాలన్ని సఫలం కావడంతో పాటు ఒకేసారి నాలుగు టన్నుల బరువు గల శాటిలైట్లను రోదసీలోకి పంపేందుకు మార్గం సుగమమయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)మార్చిలో ప్రయోగించే జిఎస్‌ఎల్‌వి- మార్క్ 3 భారీ ప్రయోగానికి ముందు క్రయో దశలో తలెత్తే సమస్యపై శాస్తవ్రేత్తలు వివిధ రకాల పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి తమిళనాడులోని ఇస్రో సెంటర్ మహేంద్రగిరిలో జిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో ఉపయోగించే సి 25 క్రయో దశకు వివిధ రకాలు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 55సెకన్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షను శాస్తవ్రేత్తలు విజయవంతం చేశారు. జిఎస్‌ఎల్‌వి- మార్క్ 3 వంటి భారీ ప్రయోగాల ద్వారా ఒకేసారి నాలుగు టన్నుల బరువుగల ఉపగ్రహాలను ఇస్రో పంపించేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. ఈ ప్రయోగంలో ఉపయోగించే క్రయో దశలో కొన్ని సమస్యలను అధిగ మించేందుకు శాస్తవ్రేత్తలు గతంలో కూడా ఎన్ 110, ఎస్ 200 పరీక్షలు కూడా నిర్వహించి ఉన్నారు. చివరి దశ సి 25 క్రయో దశ పరీక్ష కూడా విజయవంతం కావడంతో మార్క్ 3 ప్రయోగానికి మార్గం సుగమం అయ్యింది. తద్వారా ఒకేసారి ఇస్రో నాలుగుటన్నుల బరువుగల భారీ ఉపగ్రహాలను సునాయసనంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సులువుగా ఉంటుంది. దీని ఇస్రో శాస్తవ్రేత్తలు మూడు సంవత్సరాల నుండి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి క్రయో దశను విజయవంతంగా పంపించేందుకు చేసిన ప్రయత్నాలన్ని విజయవంతమయ్యాయి. ఈ విషయాన్ని ఇస్రో కూడా అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో 103 ఉపగ్రహాల ప్రయోగాలకు కూడా ఇస్రో సన్నద్ధమవ్వడం విశేషం.