ఆంధ్రప్రదేశ్‌

అందరికీ పరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 27: ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెక్కులు అరకొరగా పంపిణీ చేస్తున్నారంటూ కడప జిల్లా గండికోట రిజర్వాయర్ ముంపువాసులు కొండాపురంలో ఆర్డీవో వినాయకం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ముంపువాసులు మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలందరికీ పరిహారం చెక్కులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించినా విడతల వారీగా అదీ అరకొరగా పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండా గ్రామానికి 10 లేదా 20 మందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివాహమైన అమ్మాయిలకు చెక్కులు పంపిణీ చేయలేదని వివరించారు. గతంలో పెళ్లి అయిన మహిళలకు సైతం పరిహారం చెక్కులు అందజేస్తామని చెప్పి ప్రస్తుతం పంపిణీ చేయకపోవడం ఏమిటని వారు నిలదీశారు. ఈసందర్భంగా ఆర్డీవో వినాయకం మాట్లాడుతూ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉన్నవారందరికీ పరిహారం అందిస్తామన్నారు. అందరికీ ఒకేసారి చెక్కులు అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో అధికారులు తీసుకున్న అఫిడవిట్‌లో కుటుంబ సభ్యులు కొంతమంది సంతకాలు చేశారని, అలాగాకుండా చెక్కులు తీసుకునే వారు మాత్రమే సంతకాలు చేయాలన్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే, అఫిడవిట్‌లో తేడాలున్నాయని అందువల్ల వాటి పరిశీలన కోసం కొన్ని చెక్కుల పంపిణీ నిలిపివేశామన్నారు. పరిశీలించిచెక్కులు అందజేస్తామన్నారు. అర్హులందరికీ చెక్కులు అందిస్తామన్నారు. ముంపువాసులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొండాపురం సిఐ రవిబాబు, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, తాళ్ళపొద్దుటూరు ఎస్‌ఐ కృష్ణయ్య బందోబస్తు పర్యవేక్షించారు.