ఆంధ్రప్రదేశ్‌

విశాఖ భాగస్వామ్య సదస్సుకు రెట్టింపు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: విశాఖలో జరుగుతున్న రెండో భాగస్వామ్య సదస్సుకు గత ఏడాదికన్నా రెట్టింపు స్పందన లభించిందని ఎపి ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ సి.కుటుంబరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాదిలో 328 ఎంవోయులు కుదరగా, అందులో 42 శాతం వాస్తవరూపం దాల్చాయన్నారు. పెట్టుబడులు 42 శాతం ఉన్నాయన్నారు. సిఎం డ్యాష్‌బోర్డ్‌లో ఏ కంపెనీ ఎంత వరకు వుంది, ఎంత శాతం పెట్టుబడులు పెడుతుంది, పనులు ఎంతవర కు జరిగాయి, ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ప్రతి రూపా యి కూడా అందరికీ కనిపించే విధం గా అన్ని వివరాలు పొందుపర్చామన్నారు. ప్రభుత్వానికి ఏదీ దాయాల్సిన అవసరం లేదన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రతి రాష్ట్రం కష్టపడుతుందని, అయితే గత ఏడాది గుజరాత్‌లో కేవలం 12 శాతం, కర్నాటకలో కేవలం 5 శాతం మాత్రమే ఎంఓయులు ఆచరణలోకి వచ్చాయన్నారు. ఏపీకి మాత్రం 48 శాతం వచ్చిందన్నారు. ఇదంతా బోగస్ అని ప్రతిపక్షాలు చెబుతున్నాయని, అలా అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెం బర్ వన్‌గా వచ్చేదా అని ప్రశ్నించారు. మొదటి ఏడాది రెండో స్థానం నుంచి ఈ ఏడాది మొదటి స్థానానికి రాగలిగిందంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగుండబట్టి పరిశ్రమలు ఇక్కడ పెట్టడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రపంచంలో పెద్ద సోలార్ ప్లాంట్ కేవలం 500 రోజుల్లో కర్నూలులో పూర్తి కావొస్తుందన్నారు. ఏపీ సోలార్ క్యాపిటల్ కాబోతుందని అన్నారు. అపోలో టైర్స్‌ను ఆకర్షించగలిగాం, సీయట్, ఏషియన్ పెయింట్స్, నెరొలాక్, బర్జర్ పెయింట్స్ కూడా వచ్చాయన్నారు. ఇప్పటివరకు 4.20 లక్షల కోట్లు ఎంవోయులను సంపాదించుకున్నామన్నారు. సీయట్, నార్వెస్ట్ వంటివి వచ్చాయన్నారు. దాన్ని కూడా కేంద్రం నీతి ఆయోగ్ దగ్గర నుంచి తీసుకువచ్చిందన్నారు. చైనా కంపెనీ రూ.90వేల కోట్లతో ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది రూ.4లక్షల 62వేల కోట్లకు గాను రూ.లక్షా 43వేల కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయన్నారు.