ఆంధ్రప్రదేశ్‌

‘మహిళా పార్లమెంట్’పై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాల ప్రచారంలో భాగంగా ఆర్‌టిసి బస్టాండులు, బస్సులు, ఇతర ప్రాంతాల్లో ప్రచారాన్ని చేపడుతున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర అతిధి గృహంలో శనివారం జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనురాధ, జిల్లా కలెక్టర్ బాబు. సదస్సు సమన్వయకర్త రామలక్ష్మి, కార్పొరేటర్ షేక్ షహారాబానులతో కలిసి సమావేశాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత దిశగా ఈ పార్లమెంటు సదస్సును పూర్తిస్థాయి వేదికగా వినియోగించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇందుకోసం భద్రతతో కూడిన ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో జరిగే సదస్సుకు వాలంటీర్ల నుండి పేర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తిగల ఔత్సాహిక మహిళలు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖులతో పాటు భాగస్వామ్యం అయ్యే వారికి వసతి, భద్రత, తదితర ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేపడుతున్నామన్నారు. జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మహిళా రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించడం ద్వారా ఆదర్శవంతంగా నిలుస్తోందన్నారు. దివంగత ఎన్‌టిఆర్ ఆశయాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నారన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడించేలాగ జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహిస్తున్నామని అందుకు స్పీకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు. సదస్సు సమన్వయ అధికారి రామలక్ష్మి మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రముఖులు, విద్యార్థులతో కూడిన 12వేల మంది మహిళలు, తదితరులతో సమావేశాలు నిర్వహణ చేపడుతున్నామన్నారు. భాగస్వామ్యం అయ్యేందుకు వివరాలకు టోల్‌ఫ్రీ నెం.18005991111 సంప్రదించాలని ఆమె వివరించారు.