ఆంధ్రప్రదేశ్‌

గణే శ్ విగ్రహ శకలాలను పరిశీలించిన పురావస్తు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా సమీపంలోని ఢోల్‌కల్ పర్వతంపై ఉన్న గణేశ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నేపథ్యంలో శనివారం అరుణ్‌శర్మ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. బృందం నేరుగా ఫర్సాపాల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు ఏర్పాటు చేసి, వివరాలు సేకరించింది. ఫర్సాపాల్ గ్రామానికి తీసుకువచ్చిన విగ్రహ శకలాలను ఈ సందర్భంగా అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదివాసీలకు అధికారులు హామీ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ సాగుతోంది. బస్తర్ ఐజీ కల్లూరి సైతం శుక్రవారం రాత్రే దంతెవాడకు చేరుకుని అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని స్థానిక ఎస్పీకి సూచించారు.