ఆంధ్రప్రదేశ్‌

అన్ని నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 28: రాష్ట్రంలోని విద్యార్థులకు, యువతకు క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాలను నెలకోల్పుతామని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 37 క్రీడావికాస కేంద్రాలు పూర్తయ్యాయని, మరో 18 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ ఏడాది మరో 60 క్రీడా వికాస కేంద్రాలను ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. శనివారం ఇక్కడి జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17 ఏళ్ల అనంతరం క్రీడలకు కొత్త విధానం అమల్లోకి తెచ్చారన్నారు. కొత్త విధానంలో క్రీడలతోనే ఆరోగ్యం అనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. ఇందుకు వివిధ శాఖల సమన్వయంతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వివిధ క్రీడల్లో ఆసక్తి కలిగేలా పోటీలను నిర్వహిస్తామన్నారు. విజయనగరంలో క్రీడా పాఠశాల నెలకూల్పుతామన్నారు. ఇందుకోసం డిపిఆర్ తయారు చేయమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అప్పగించారన్నారు. డిపిఆర్ వచ్చిన వెంటనే ఈ ఏడాది ప్రవేశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా వంద మంది కోచ్‌లను నియమించనున్నట్టు తెలిపారు. అందులో కెనడా, మలేషియా తదితర దేశాలకు చెందిన నిష్ణాతులైన విదేశీ కోచ్‌లు ఉన్నారన్నారు. వారితో రాష్ట్రంలో క్రీడాకారులకు తర్ఫీదు ఇప్పిస్తామని తెలిపారు. కోచ్‌లకు పింఛను, కుటుంబ పింఛను మంజూరు చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని, సీనియర్లకు రూ.5వేలు, జూనియర్లకు రూ.3వేలు చొప్పున మూడేళ్లపాటు ప్రోత్సాహకాలు ఇస్తారు.