ఆంధ్రప్రదేశ్‌

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 28: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రత పట్ల మరింత బాధ్యత పెరగాల్సి ఉందని, ఇందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు చైతన్యవంతమై ప్రభుత్వాలతో కలసి పని చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహం పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, ఉపాధి భద్రత కోసం మరిన్ని పటిష్టమైన చర్యలు అవసరమని, ఇందుకు ప్రతివొక్క స్వచ్ఛంద సంస్థ చైతన్యవంతం కావాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని నడకుదురు గ్రామంలో శనివారం రోటరీ ఫౌండేషన్ సెంటినల్ కాన్ఫరెన్స్ జరిగింది. గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, ఆహ్లాదకరమైన పర్యావరణం, మంచి ఆదాయాన్నిచ్చే ఉపాధి నైపుణ్యాలు అవసరమన్నారు. ఇటువంటి అంశాలు ప్రజల సంతోషకరమైన జీవితానికి దర్పణం పట్టే సూచికలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. దేశంలో పోలియో వ్యాధి నిర్మూలనకు కూడా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకై రోటరీ సంస్థ పాటు పడుతోందని అభినందించారు. మనిషి ప్రాణ రక్షణకు రక్తం ఎంతో అవసరమని, రక్తనిధి సేకరణలో కృషి చేస్తున్న ఇండియన్ రెడ్‌క్రాస్ కృషిలో రోటరీ భాగస్వామ్యం వహించాలని కోరారు. వ్యాధుల కన్నా వ్యాధుల చికిత్స కోసం అవుతున్న ఖర్చు ప్రజలను మరింత కృంగతీస్తోందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుకే వైద్యం సామాన్యులకు అందేలా వైద్యులు మానవీయ కోణంలో ఆలోచించి, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేదలు ఖరీదైన వైద్యం చూసి ఆందోళన చెందుతున్నారని, అటువంటి వారికి వైద్యులు బాసటగా నిలచి, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఆరోగ్య రక్షణ కోసం వైద్యులు అంకితభావంతో పనిచేసినపుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంన్నారు. విద్య ద్వారా వికాసం, ఉపాధి అవకాశాలందించేందుకు, పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించుకోవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న ఇండియన్ రోటరీ సంస్థ మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ కోరారు. కార్యక్రమంలో టిసి ఎస్ సంస్థ మాజీ సి ఇ ఒ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్వ ఛైర్మన్ పద్మశ్రీ రామదొరైకు రోటరీ సంస్థ అందించిన వొకేషనల్ ఎక్స్‌లెన్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గవర్నర్ ప్రదానం చేశారు. మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం రవిప్రకాష్, రోటరీ ఇంటర్నేషనల్ ప్రతినిధి డాక్టర్ వెంకటేష్, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్‌విఎస్ రావు, ఎస్‌సిహెచ్ రామకృష్ణ, జికె శ్రీనివాస్, కళ్యాణ్‌చక్రవర్తి, ఎల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రామదొరైకి అవార్డు ప్రదానం చేస్తున్న గవర్నర్ నరసింహన్