ఆంధ్రప్రదేశ్‌

ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌పై నేడు జూ.కళాశాలల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 29: విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్టవ్య్రాప్తంగా సోమవారం జూనియర్ కళాశాలలను బంద్ చేసి యాజమాన్యాలు, అధ్యాపకులు ధర్నాలు, రాస్తారోకోలు జరిపి అధికారులకు విజ్ఞాపనలు ఇవ్వనున్నారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరపనేని సూర్యనారాయణ, సహాధ్యక్షుడు ఎఎంవి అప్పారావు విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ కళాశాలలు బలంగా వున్న విజయవాడ, నెల్లూరు, విశాఖ, గుంటూరు, తిరుపతి లాంటి పట్టణాల్లో యాజమాన్యాల మధ్య ఒప్పందాలు, ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగా జం బ్లింగ్ కాస్తా గ్యాంబ్లింగ్‌గా మారిందని విమర్శించారు.