ఆంధ్రప్రదేశ్‌

ఒకే రోజు మూడు పోటీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: వివిధ విభాగాల్లో ఉద్యోగాల నిమిత్తం నిర్వహించే మూడు పోటీ పరీక్షలు ఒకే రోజు నిర్వహించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహించేందుకు ఎపిపిఎస్‌సి నిర్ణయించింది. ఆదే రోజున సిండికేట్ బ్యాంక్ 400 ప్రోబేషనరీ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి పరీక్ష నిర్వహించనుంది. ఇపిఎఫ్‌ఒలో ఇఒ/ఎఒ ఉద్యోగాలకు సంబంధించి యుపిఎస్‌సి కూడా ఆదే రోజు పరీక్ష నిర్వహించనుంది. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల తాము నష్టపోతున్నామని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పరీక్షల తేదీలను ఇతర పరీక్షలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించాలని కోరుతున్నారు.