ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ ప్రాజెక్టులు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన వివిధ హామీలను సాధించే దిశగా పార్లమెంటులో తమ వాణి వినిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన వివిధ హామీల్లో ఇంకా కొన్ని పరిష్కారం కావాల్సి ఉందని, వీటి సాధనకు ఎంపిలు కృషిచేయాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటన, రాష్ట్రానికి ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత వంటి అంశాలపై స్పందించాలని తెలిపారు. విభజన వల్ల నష్టపోయినప్పటికీ ఉదారంగా ఆదుకునేందుకు సాయం అందించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపిలకు తెలిపారు. అంతకుముందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కూడా పార్లమెంటు సభ్యులు సమావేశమై రానున్న పార్లమెంటు సమావేశాల్లో పార్టీపరంగా, ప్రభుత్వపరంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యుడు టిజి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే వున్నామని గుర్తుచేశారు. పూర్తిస్థాయి మెజార్టీ వున్నప్పటికీ ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
భాగస్వామ్య పక్షాలను కూడా పట్టించుకోవటం లేదని దూరంగా వుంచుతారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిధులు లేవంటూ ఖాళీ జోలి చూపిస్తున్నారన్నారు. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు కేబినెట్ తీర్మానం సరిపోతుందని దీనికి వీలైనంత త్వరగా చట్టబద్దత కల్పించాలని తాము కోరనున్నట్లు తెలిపారు. చట్టబద్దత కల్పించడం వల్ల భవిష్యత్‌లో ఏ ఇబ్బందీ ఎదురవకుండా వుంటుందన్న ఆలోచనే అని తెలిపారు.
కేంద్రమంత్రి సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అన్న అంశం ఇక చరిత్ర మాత్రమేనని మార్చి 17 తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మరో ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ హోదా కథ ఇక లేదని, ప్యాకేజీ మాత్రమే వుందని అన్నారు. సిఎంతో జరిగిన సమావేశంలో పలువురు ఎంపిలు ప్యాకేజీ వల్ల ఒనగూరే ప్రయోజనాలు గూర్చి విస్తృతమైన ప్రచారం కల్పించడంలో వెనుకబడ్డామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.