ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడుల కేసులో జగన్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: అక్రమ పెట్టుబడి కేసులో సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుండి వైఎస్‌ఆర్ సిపి అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డిని మినహాయిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మినహాయింపు ఉత్తర్వులు ఫిబ్రవరి 15 వరకూ అమలులో ఉంటాయి. పార్టీ అధినేతగా ప్రజలను, పార్టీ నేతలను కలవాల్సి ఉన్నందున ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టు ముందు హాజరు నుండి మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈమేరకు ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకూ సిబిఐ జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా 11 చార్జిషీట్‌లను దాఖలు చేసింది. దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా, ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యలకు కూడా వ్యక్తిగత హాజరు నుండి న్యాయమూర్తి మినహాయింపునిచ్చారు. కాగా వేరే కేసులో పెన్నా సిమెంట్స్ అధినేత పి ప్రతాప్‌రెడ్డి స్క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ ఎం ఎస్ కె జైస్వాల్ తిరస్కరించారు.