ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీకి చట్టబద్ధత అడిగాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు టిడిపి లోక్‌సభ నేత తోట నరసింహం తెలిపారు. సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి టిడిపి తరపున తోట నరసింహం పాల్గొన్నారు. అనంతరం తోట నరసింహం విలేఖరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రానికి టిడిపి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపినట్టు వెల్లడించారు. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. ఎపీలో రైల్వే అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరమన్నారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీలో ఉన్నాయని టిడిపి ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీనినే హోదాగా ఊహించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.