ఆంధ్రప్రదేశ్‌

హోదాపై పోరు ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, రైల్వేజోన్ కోసం బడ్జెట్ సమావేశాలల్లో పోరాటం కొనసాగిస్తామని వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయి రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజమోహన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాకి సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్టు చెబుతున్నా, హోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రారిశ్రామికంగా రాయితీలు వస్తాయని మేకపాటి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉన్నత పదవుల్లో ఉండికూడా ప్రత్యేక హోదా విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణల కోసం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్‌బిల్లు ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు.