ఆంధ్రప్రదేశ్‌

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే అలైన్‌మెంట్ వారంలోగా ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: ప్రతిష్టాత్మక అమరావతి-అనంతపురం రహదారి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ వారం రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తున్న రహదారులు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్‌ను ఈ ఆగస్ట్ 15న ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రహదారులు, భవనాల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రహదారుల పనులకు సంబంధించిన అన్ని అంశాలపై సిఎం చర్చించారు. అనంతపురం నుంచి అమరావతి వరకు నేరుగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మించతలపెట్టామని, ఇది దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించి, వారం రోజుల్లో అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలన్నారు. భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ రహదారి పక్కనే రైల్వేలైన్ కూడా ఉంటుందని అన్నారు. వీటన్నింటి సత్వర అనుమతుల కోసం సంబంధిత అధికారులకు, కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని తన అదనపు కార్యదర్శి రాజవౌళిని ఆదేశించారు. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయడం కోసం ఐదు జిల్లాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేయాలన్నారు. ఈ రహదారి వెంబడి ట్రాన్సిట్ డెవలప్‌మెంట్ జరగాలని, అందుకు అధ్యయనం చేపట్టాలని ఆదేశించారు. ఈ రహదారి వెంబడి పారిశ్రామిక పట్టణ సముదాయాలు వస్తాయని తెలిపారు. రెండేళ్లలో ఈ రహదారిని పూర్తిచేయాలన్నారు. విజయవాడలో నిర్మిస్తున్న దుర్గమ్మ ఫ్లైఓవర్ ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణానదిని దృష్టిలో ఉంచుకుని కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి గుడి ద్వారం వరకు, అర్జునవీధి, ప్రకాశం బ్యారేజి, బందరు కాలువలను కలుపుకుంటూ సుందరీకరణ చేపట్టాలని, దీనికి ప్రసిద్ధ ఆర్కిటెక్టుల సహకారం తీసుకోవాలని చెప్పారు. అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.
బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ డిజైన్ల పరిశీలన
విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ దగ్గర నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ డిజైన్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. విజయవాడలో బెంజిసర్కిల్ అత్యంత ముఖ్య కూడలి అని, బెంజిసర్కిల్ సహజ అందం చెదిరిపోకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలన్నారు. కూడలిలోని ఐదు రోడ్లను కలిపేలా ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ డిజైన్లు తయారుచేయాలని అధికారులకు సూచించారు. విజయవాడ-మచిలీపట్నం రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దిష్ట కాల పరిమితిలోపు పూర్తికావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాయపూర్ నుంచి విశాఖ-్భవనపాడు వరకు నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారిని ఎక్కువ మలుపులు తిప్పి దూరం పెంచకుండా వంపులు లేని సుందర రహదారిగా ఉండేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రా, ఏపిఎస్‌ఆర్‌టిసి ఎండి మాలకొండయ్య, సిఎం అదనపు కార్యదర్శి అడుసుమల్లి రాజవౌళి పాల్గొన్నారు.

చిత్రం..రహదారులు, భవనాల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-