ఆంధ్రప్రదేశ్‌

వారంలో నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి31:హంద్రీనది నుంచి ఆక్రమంగా ఇసుక తవ్వకాలు, దీనిపై తీసుకున్న చర్యలతో వచ్చే వారం వివరాలు ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్‌పిని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రజస్టీస్ రమేష్ రంగనాథన్, జస్టీస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లు ఈ కేసును విచారిస్తోంది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్నామని, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. కఠిన చర్యలు తీసుకొని ఉంటే అక్కడ అక్రమ ఇసుక మైనింగ్ జరగదని, చర్యలపై వారంలో నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం ఒక జోక్‌లా ఉంది తప్ప వాస్తవంగా లేదని కోర్టు మందలించింది. అధికారులు తమ బాధ్యతలు తాము నిర్వహించడానికి సమయం అడగడం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. కృష్ణగిరి మండలం ఎర్రగుడి మనె్నకుంట గ్రామానికి చెందిన బజారితో పాటు మరో 11 మంది ఇసుక అక్రమ క్వారీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.