ఆంధ్రప్రదేశ్‌

కనీసం ట్విట్టర్‌లోనైనా స్పందిస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేను కనీసం ట్విట్టర్‌లోనైనా స్పందిస్తున్నా, మన ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదు..’ అని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలు తిరగబడతారని ప్రభుత్వంలో ఉన్న వారు తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. మంగళవారం చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు పలువురు పవన్ కల్యాణ్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై బిజెపి నేతలు మొండిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు తనకు బిజెపియే ఛాయిస్‌గా ఉందని, అందుకే ఎన్డీయేకు ఓటెయ్యాలని కోరానని ఆయన గుర్తు చేశారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అప్పుడే చెప్పానని ఆయన చెప్పారు. తాను ‘లెఫ్ట్’ కాదు, ‘రైటు’ కాదని, ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాకు సమానమని ప్రకటిస్తున్నప్పుడు అంత హడావుడిగా ప్యాకేజీని అర్థరాత్రి ఎందుకు ప్రకటించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారని, దానికి మించింది మరొకటి లేదని అన్నారని, అందుకే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని పవన్ తెలిపారు. వాళ్ళ పక్కన తిరిగినప్పుడు ఏమీ అనకుండా ఇప్పుడేమో తనను ట్విట్టర్‌లో స్పందిస్తున్నారని విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. తాను ట్విట్టర్‌లోనైనా మాట్లాడుతున్నానని, మన ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదని అన్నారు. ప్రత్యేకహోదా తదితర అంశాలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలని, ఈ విషయంలో అన్ని పార్టీలూ కలిసి పోరాటం చేయాలన్నది తన అభిమతమని అన్నారు. అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్ళేందుకు తనకు అనుభవం సరిపోదని, కాబట్టి ఇతర పార్టీలు ముందుకు వస్తే తానుకూడా వారితో కలిసి పోరాడుతానని ఆయన తెలిపారు.