ఆంధ్రప్రదేశ్‌

సచివాలయంలో ‘బడ్జెట్’ సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి మంత్రులు తమ శాఖల అధికారులతో సమీక్షలు చేయడంతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో సందడి కనిపించింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వివిధ శాఖల మంత్రులతో ఒకవైపు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండగా, మరోవైపు మంత్రులు అధికార్లతో సమావేశమై సమీక్షలు నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై మంత్రి యనమల కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయా వర్గాలతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు. వివిధ విభాగాల అధికారులతోనూ సమావేశమై చర్చించారు. ఆర్థిక మంత్రికి బడ్టెట్ ప్రతిపాదనలు ఇచ్చేముందు మంత్రులు తమ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కిమిడి మృణాళిని, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు, తదితరులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ముందుగా తమ శాఖల అధికారులతో మంత్రులు సమావేశమై అదనంగా కోరాల్సిన నిధులు, కొత్త పథకాలు వంటివాటిపై చర్చించారు. ఏయే పద్దుల కింద అదనంగా నిధులు కోరవచ్చో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు, మంత్రుల రాకతో సచివాలయంలో సందడి నెలకొంది. వివిధ పద్దుల కింద ఆయా శాఖలకు ఇప్పటికే నిధులు కేటాయించినప్పటికీ పూర్తిగా ఖర్చు చేయకుండా, అదనంగా నిధులు కేటాయించాలని కోరడం కూడా మంత్రి యనమల దృష్టికి వచ్చింది. ఖర్చుచేయని నిధులను అదనపు నిధులు కోరిన శాఖలు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు సాధించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని సూచించారు. సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల నుంచి ఎక్కువగా నిధులు రాబట్టాలన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ఖర్చుచేయాలని, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా జోడించి ఖర్చుచేయాలన్నారు.