ఆంధ్రప్రదేశ్‌

ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 31: విజయవాడ గన్నవరం విమానాశ్రయం సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్‌ను మంగళవారం లారీ ఢీకొనడంతో కలకలం రేగింది. విశాఖపట్నం నుండి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ లారీ విజయవాడ ఆటోనగర్‌కి వెళుతుండగా, ఎయిర్‌పోర్ట్ సమీపంలో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ తనిఖీ నిమిత్తం ఆగింది. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ .. ఆక్సిజన్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆక్సిజన్ ట్యాంకర్ పంప్ వాల్వ్ సీల్ బద్దలయి, లోపల ఉన్న 12 టన్నుల ఆక్సిజన్ వెలుపలికి వచ్చి జాతీయ రహదారిని కమ్మేసింది. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ట్యాంకర్‌లోని ఆక్సిజన్ దాదాపు గంట వరకు బయటకు వస్తూనే ఉంది. రహదారిపై దట్టంగా పొగలా కమ్మేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గన్నవరం అగ్నిమాపక కేంద్రం అధికారి మురళీ కొండబాబు ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ను వాతావరణంలో కలిపే ప్రయత్నం చేశారు. గన్నవరం సైదా వాహనంతో పాటు, విమానాశ్రయానికి చెందిర రెండు ఫైరింజన్లతో రహదారిపై ఉన్న ఆక్సిజన్‌ను నీటితో శుభ్రపరిచారు.