ఆంధ్రప్రదేశ్‌

ఉద్దానం బాధితులకు మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి మార్చి 1 నుంచి నూరు శాతం స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రానున్న మూడేళ్లలో ఎన్టీఆర్ జలసిరి కింద 1.2 లక్షల బోర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ జలసిరి పథకంపై మంగళవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల పరిధిలో పలువురు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఆ ప్రాంతానికి మంచినీరు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. ఏజన్సీ ప్రాంతంలో వేసవిలో గిరిజనులు కాలుష్య జలాలతో రోగాల బారిన పడకుండా ఐటిడిఎ ప్రాంతాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి అమలు ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అక్కడ 100 శాతం సురక్షిత నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నామన్నారు. గనులు తవ్వే ప్రాంతంలో కూడా నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. అక్కడ కూడా సురక్షిత నీటిని సరఫరా చేస్తామన్నారు. గనులు ఉన్న గిరిజన ప్రాంతాల్లో గనుల శాఖ నిధులను గిరిజనుల సంక్షేమానికి నిధులు ఉపయోగించుకోవాలన్నారు. మంచినీటి వనరులను నాశనం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ప్రాంతాలను ఇప్పటి నుంచే గుర్తించాలన్నారు. వాటర్ ఆడిటింగ్‌కు సంబంధించి కెపిఎంజి ప్రాజెక్టు రిపోర్టును సూత్రప్రాయంగా ఆమోదిస్తున్నట్లు సిఎం తెలిపారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. వాటర్ ఆడిటింగ్, జలవనరుల పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి నివేదికలో పొందుపరచాలని కోరారు. జిల్లాల వారీగా జలవనరులపై మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలన్నారు. అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు, వాటి ద్వారా ఎంత నీరు ఏయే ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న నీటి పథకాల స్థితిగతులు పరిశీలించి మ్యాపింగ్‌తో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను సందర్శించి అధ్యయనం చేసి నివేదికలో పొందుపరచాలన్నారు. ఇకపై ఎన్టీఆర్ జలసిరి పనులను ప్రతినెలా సమీక్షిస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిరి రెండోదశ కింద రానున్న మూడేళ్లకు 1.2 లక్షల బోర్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 30 వేల బోర్లు, వచ్చే ఏడాది 60 వేల బోర్లు తవ్వాలని ఆదేశించారు. బోర్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, మృణాళిని, సిఎం కార్యాలయ సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న, సిఎం ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, పాల్గొన్నారు.

చిత్రం..ఎన్టీఆర్ జలసిరిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు