ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 31: దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం గుంటూరులోని రాష్టప్రార్టీ కార్యాలయంలో టిడిపి సంస్థాగత ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు 70 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి పార్టీ ప్రతిష్ఠను పెంచిన ఘనత కార్యకర్తలదే అన్నారు. ఇకపై ప్రతి నెలా జిల్లాల్లో కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంస్థాగత కమిటీల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కమిటీలు కీలక బాధ్యతలు వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు ముడిపెట్టాలనుకోవటం అవివేకమన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం జిఎస్‌టి తీసుకొచ్చిందని చెబుతూ, దీంతో ఇకపై ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికీ సాధ్యపడదని తేల్చిచెప్పారు. హోదా అంశాలే ప్యాకేజీలో అమలవుతున్నాయని కేంద్రంతో సఖ్యతగా లేకపోతే రాష్ట్రానికి నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశాలు లేవన్నారు. ప్రజలు ప్రభుత్వ పాలనపై చర్చించుకునే దిశగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించగలదని ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి సాధ్యమన్నారు. ఇప్పటి వరకు రెండువిడతలుగా జరిగిన సిఐఐ సదస్సుల ద్వారా లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయన్నారు.
ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రకారమే పదవులు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారని గ్రామస్థాయిలో పటిష్టంగా ఉంటే పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. మొక్కుబడి చర్చలతో సరిపెట్టకుండా ఛాలెంజిగా వ్యవహరించాలని హితవు పలికారు. గ్రామ కమిటీల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్షాల కట్టుకధలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.