ఆంధ్రప్రదేశ్‌

పోర్టు కార్మికులకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్లకార్డ్ ప్రదర్శించారు. అయితే దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో ప్లకార్డ్ ప్రదర్శించవద్దని విజయసాయి రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ సభలో ఉన్నందున్న ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. విశాఖపట్నం పోర్టు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని గురువారం నాడు జీరో అవర్‌లో విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. విశాఖ ఫోర్టులో కార్గోల నుంచి బొగ్గు తరలించడానికి శాశ్వత కార్మికులు సరిపోకపోవడంతో 1985 విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డు వెయ్యి మంది ప్రైవేటు కార్మికులను కాంట్రాక్టు పద్ధతిలో పనిలోకి తీసుకున్నారని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతి ఇప్పటికి కోనసాగుతోందని సభకు వివరించారు. పోర్టులో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని, శాశ్వత కార్మికులతో సమానంగా వేతనాలు కల్పించడం లేదని సభలో కేంద్రం దృష్టికి తీసుకోచ్చారు. దీంతో సీపీఎం ఎంపీ తపన్ సేన్ జోక్యం చేసుకొని విశాఖ పోర్టులోనే కాదని దేశంలో ఉన్న అన్ని పోర్టుల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.