ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా శ్రీ కాళహస్తి గాలి గోపురం కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 2: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ముక్కంటీశుడు కొలువుదీరి ఉన్న శ్రీ కాళహస్తి ఆలయ రాజగోపురం పునర్‌నిర్మాణమైన నేపథ్యంలో గురువారం కుంభాభిషేకం భక్తుల శివ నామస్మరణలు, వేద మంత్రాలు మధ్య వైభవంగాప్రారంభమైంది. ఈక్రమంలో గురువారం వేకువ జామున హోమాలతో ప్రారంభమై కలశస్థాపన చేశారు.
కంచి పీఠాధిపతి ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో శ్రీ కాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇఒ భ్రమరాంబ నేతృత్వంలో వేద పండితులు శైవాగమ శాస్త్రోక్తంగా కలశ స్థాపన చేపట్టారు. ముక్కంటీశుని రాజగోపురం కూలి పోయిన నేపథ్యంలో నవయుగ నిర్మాణ సంస్థ రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసిన విషయం పాఠకులకు విదితమే. 144 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ రాజగోపురంపై 8 అడుగుల పొడవున్న 9 బంగారు కలశాలను గోపురంపై స్థాపన చేశారు. అత్యంత ఎత్తులో ఉన్న ఈ గోపురంపైకి కలశాలను క్రేన్‌ల ద్వారా గోపురం శిఖరంపైకి అత్యంత భద్రతా చర్యల మధ్య ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా విజయేంద్ర సరస్వతి సర్వయాగ పూజలను నిర్వహించిన అనంతరం పవిత్ర జలాలను అర్చకులు క్రేన్ ద్వారా గోపుర శిఖరంపైకి తీసుకువెళ్లి అభిషేకించి పుష్పార్చన చేశారు. ఈ జలాలను విజయేంద్ర సరస్వతి భక్తులకు సంప్రోక్షణ చేశారు. అంతకు మునుపు యాగశాలలో ఉన్న స్వర్ణ కలశాలను ఆలయ ప్రదక్షణగా ఊరేగింపుగా రాజగోపురం వద్దకు తీసుకువచ్చి క్రేన్‌ల సహకారంతో గోపురంపై ఉంచారు. ఈకార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణ, శాప్ చైర్మన్ పి.ఆర్.మోహన్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చిత్రం..కలశ ప్రతిష్ఠాపన సందర్భంగా పవిత్రజలాలను
భక్తులపై ప్రోక్షణ చేస్తున్న కంచి పీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి