ఆంధ్రప్రదేశ్‌

నేడు విశాఖ ఉత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 2: విశాఖ ఉత్సవ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుంది. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఆర్‌కే బీచ్ వేదికగా వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ ఉత్సవాలను కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారు. విశాఖ జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలను, పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగాయి. మహిళా బీచ్ వాలీబాల్, పతంగుల పోటీలు, ఇసుక తినె్నలపై క్వాడ్ బైక్ రేసు వంటివి తొలిసారిగా ప్రత్యేకతలు సంతరించుకోనున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రముఖ దేవాలయాల నమూనాలు, చిన్న పిల్లల క్రీడా ప్రాంగణాలు, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు. ఎంజిఎం పార్కులో ప్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సాగరతీరంలో బ్రెజిల్ తరహాలో పెద్ద కార్నివాల్‌ను 20వేల మందితో నిర్వహిస్తారు.