ఆంధ్రప్రదేశ్‌

నేడు ఆదిత్యుని జయంతి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 2: అరసవల్లిలో ఆదిత్యుని జయంతి ఉత్సవం గురువారం అర్థరాత్రి నుంచి ప్రారంభ కానున్నది. వెలుగుల రేడు శ్రీ సూర్యనారాయణస్వామి జయంత్యుత్సవం సందర్భంగా మాఘ శుద్ధ సప్తమీ శుక్రవారం రథసప్తమి పండుగ కన్నులపండువుగా దేవాదాయశాఖ నిర్వహించనుంది. గురువారం రాత్రి 12.15 గంటల నుంచి మహాక్షీరాభిషేక సేవ ప్రారంభం అవుతుంది. శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణస్వామి నిజరూప దర్శనం భక్తులకు కలుగజేస్తారు. శారదపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సూర్యదేవుని మూలవిరాట్‌కు తొలి పూజలతో పాటు మహాక్షీరాభిషేక సేవ ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆదిత్యునికి 12.15 గంటలకే మేల్కొలుపు సేవ, సుప్రభాతసేవను నిర్వహిస్తారు. అత్యంత అరుదైన ఆదిత్యుని నిజరూప దర్శనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ ఉంటోంది. విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహానివేదన అనంతరం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి స్వామివారికి విశేష పుష్పమాలలంకార సేవ, సర్వదర్శనం, సాయంత్రం ఆరు గంటలకు విశేషార్చన, నీరాజనము, సర్వదర్శనం ఉంటోంది. ప్రతీ ఏటా మాదిరిగా ఈసారి రాత్రి 10.30 గంటలకు స్వామివారికి జరగాల్సిన ఏకాంత సేవను జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏర్పాటుల్లో భాగంగా రద్దు చేయాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్యామలతోపాటు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మను కోరారు.