ఆంధ్రప్రదేశ్‌

ప్రగతి ఫలాలన్నీ సామాన్యుడికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 2: ‘రాష్ట్రంలో సులభతర వాణిజ్య సరళిని అమలు చేస్తూ పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం. వాటికి ఓడ రేవులు, జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ వౌలిక వసతులూ మార్కెటింగ్ సదుపాయాలూ కల్పిస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రా ష్ట్రం ఆర్థికంగాను సుస్థిర అభివృద్ధి సాధిస్తుంది. సాధించిన ప్రగతి ఫలాలన్నీ సామాన్యుడికే దక్కాలి. సామాన్యుడు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్ర మంతా సంతోషంగా ఉంటుంద’ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో గత నెల 27, 28 తేదీల్లో రెండ్రోజుల పాటు భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతమై రూ. 10.54 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగి 22 లక్షల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థ దశ, దిశను మార్చే ఈ పెట్టుబడులను రాష్ట్ర ప్రజలకే అంకితం చేస్తున్నానని తెలిపారు. ఈ లేఖను ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాల కల్పన, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గురువారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లయ్యిందని, ఆర్థిక లోటు, సంస్థాగత వనరుల లేమి వంటి సమస్యతో సతమతమవుతున్న పరిస్థితిలో రాష్ట్రం ఉందని, రెండున్నరేళ్ల పాపాయిగా ఉన్న రాష్ట్రానికి కనీసం నడక కూడా సరిగ్గా రాదని, కాని పరుగులు తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరుగులోనూ లక్ష్యం ఉందని, ఈ లక్ష్య దిశగా పాలన సాగిందన్నారు. తన అదృష్టం తాను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ తన ప్రజలు తోడుగా, నీడగా ఉన్నారన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచాటారని, ప్రపంచ శ్రేణిలో అద్భుత రాజధాని నగరం నిర్మించాలన్న సంకల్పమైతే ఉందని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని రైతులకు చెప్పానని, నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులకు పిలుపునిచ్చానన్నారు. నగరం అభివృద్ధి చెందితే భూముల ధరలు పెరుగుతాయని, ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తావంటూ ఒక్క ప్రశ్న కూడా వేయకుండా రైతులు ఏకంగా 35వేల ఎకరాల భూమిని అప్పగించారన్నారు. తనపై నమ్మకం ఉంచి విలువైన భూములను అప్పగించిన రైతుల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని, ప్రపంచమే ఈ భూ సమీకరణను చూసి నివ్వెరపోతోందని, ఇది తన అదృష్టమని, ప్రపంచలో ఒక అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానన్న విశ్వాసంతోనే 2014లో ప్రజలు తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, ఇది తన కర్తవ్యంగా భావిస్తానన్నారు. విభజన కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన నిలిచి నింరతంర శ్రమించడం తన కర్తవ్యంగా భావించానన్నారు. రాష్ట్రం తరపున బ్రాండ్ అంబాసిడర్‌నై ప్రపంచమంతా తిరుగుతున్నానని, పెట్టుబడులు పెట్టాలనే ప్రతి పారిశ్రామిక వేత్తనూ ఆహ్వానిస్తున్నానన్నారు. తన పాలన సామర్థ్యాన్ని ప్రపంచమూ విశ్వసిస్తోందని అందుకే విశాఖలో జనవరి 27, 28 తేదీల్లో సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సలో ఏకంగా రూ. 10.54 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతామంటూ పారిశ్రామికవేత్తలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 22 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్భ్రావృద్ధిలో పరిశ్రమలు, వాణిజ్యానిదే అగ్రస్థానం, పరిశ్రమలు వస్తే సుస్థిర ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, యువతకు ఉపాధి ధీమాగా ప్రశాంత జీవనం సాగుతుందన్నారు. సామాన్యులంతా ఆనందంగా ఉంటారన్నారు. తాను కోరుకునేది ఇదేనని, పాలన అంటే సామాన్యుల సంక్షేమన్నారు. సామాన్యుని సంక్షేమం లేని రాష్ట్రం ఎదిగినట్లు ప్రపంచ చరిత్రలోనే లేదన్నారు. అభివృద్ధితో సంక్షేమం సమానంగా పరుగులెత్తాల్సిందేనని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని నగర ప్రాంతంలో విద్య, వైద్యం, వౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో పెట్టుబడులకు రూ. 1.24 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని ఈ ఒప్పందాలతో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని బాబు వివరించారు.