ఆంధ్రప్రదేశ్‌

కులంపేరుతో దూషించాడని ధర్నాకు దిగిన ఎంపి కుమార్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 3: తన డ్రైవర్‌ను కొట్టి, తనను మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడి, కులం పేరుతో దూషించినా పోలీసులు నిందితుడికి అండగా నిలుస్తున్నారంటూ ఆరోపిస్తూ సాక్షాత్తూ ఒక పార్లమెంట్ సభ్యుని కుమార్తె తిరుపతిలోని నిందితుడు నివాసం ఎదుట నాలుగు గంటలపాటు ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తమను దుర్భాషలాడిన వ్యక్తితో క్షమాపణలు చెప్పించాలని ఆమె చేసిన డిమాండ్ అరణ్య రోదనగా మారింది. నిరాహారంగా నాలుగు గంటలపాటు ఆమె, ఆమె భర్త వేణు, డ్రైవర్ ఆంజనేయులు ధర్నా చేసినా ప్రయోజనం లేకపోవడంతో అక్కడే కంటతడి పెట్టింది. అంతేకాదు, ముఖ్యమంత్రి గారూ తిరుపతిలో పోలీసులు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపట్ల, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిని, దళిత మహిళ అయిన తనకు అన్యాయం జరిగినా స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారపార్టీలో తామున్నా తమకే అన్యాయం జరిగినా పట్టించుకునేవారు లేదంటూ వ్యధ చెందింది. చివరకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసు అధికారులు, కొంత మంది టిడిపి నాయకులకు నచ్చజెప్పడంతో తనకు అన్యా యం జరిగిందంటూనే ఆందోళన విరమించింది. కాగా పోలీసులు మాత్రం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని అందుకే తాము ఆమెకు క్షమాపణలు చెప్పడానికి సంఘటనా స్థలానికి తీసుకురాలేక పోయామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎంపి కుమార్తె ధర్నా చేస్తుండటంతో ఉద్రిక్తవాతావరణం నెలకొనడంతో నిందితుడిని తీసుకువస్తే అతనికి ప్రాణాపాయం జరుగుతుందోనని పోలీసులు భయపడినట్లు కనిపిస్తోంది. కాగా ఎంపి కుమార్తె, డ్రైవర్‌పై దాడిచేసి, దూషించిన వ్యక్తి ఒంగోలు ఎక్సైజ్ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి మేనల్లుడని, అంతేకాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఆ నిందితుడికి అండగా నిలబడటంతో పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.