ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ చరిత్రలో తొలిసారిగా జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: ఇంటర్మీడియట్ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో గురువారం జరిగాయి. ఈ జంబ్లింగ్ విధానంపై గత ఐదారు సంవత్సరాలుగా ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతూ వచ్చింది. ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విధానాన్ని అడ్డుకుంటూ వచ్చాయి. ప్రైవేట్ కళాశాలల్లో సరైన లాబ్‌లు లేవని, దీనివల్ల తమ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ వాదిస్తూ వచ్చాయి. అయితే దీనిపై విమర్శలు లేకపోలేదు. గతంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ముందుగానే ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులకు చేరవేసి ఎగ్జామినర్లను మేనేజ్ చేసి 30కి 30 మార్కులు వేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ జంబ్లింగ్‌పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు భైవపనేని సూర్యనారాయణ తుది క్షణం వరకు న్యాయపోరాటం జరిపారు. అయితే సాధ్యపడలేదు. ఏదిఏమైనా తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా 977 కేంద్రాలుగా రోజుకు రెండు బ్యాచ్‌లలో మూడోతేదీ ప్రారంభమయి ఈ పరీక్షలు 22వ తేదీ వరకు జరగనున్నాయి. దాదాపు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక బ్యాచ్, తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు రెండో బ్యాచ్‌కు ప్రాక్టికల్స్ జరుగుతాయి. అయితే పలు జిల్లాల్లో ఆర్‌ఇవోలు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కయినట్లు విమర్శలు హోరెత్తాయి. నిబంధన ప్రకారం ఒక కళాశాల విద్యార్థులు ఒకే బ్యాచ్‌లో సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులు లేకుండా చూడాల్సి ఉండగా ఆర్‌ఇవోలు తమ ఇష్టానుసారం ఒకే సెంటర్ వచ్చేలా చూడటమే గాక కీలకమైన కొన్ని కేంద్రాల్లో తమ కళాశాల అధ్యాపకులే ఎగ్జామినర్లుగా నియమితులయ్యేటట్లు చూసుకోగల్గారు. అన్ని కేంద్రాల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంటర్మీడియట్ బోర్డు నిధుల లేమి సాకుతో సమస్యాత్మక కేంద్రాలు పేరిట కొన్ని కేంద్రాల్లోనే ఏర్పాటు చేయటంపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. కృష్ణా జిల్లాలో 50 వేల 109 మంది విద్యార్థులకు గాను 95 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలో 22, ఎయిడెడ్ కళాశాలల్లో 20, ప్రైవేట్ కళాశాలల్లో 53 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇటు తనిఖీ బృందాలను నియమించామని ఆర్‌ఇవో రాజారావు ఆంధ్రభూమి ప్రతినిథికి చెప్పారు.