ఆంధ్రప్రదేశ్‌

12 బిసి గురుకుల పాఠశాలల్లో జూనియర్ కళాశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: రాష్ట్రంలోని 12 బిసి గురుకుల పాఠశాలల్లో జూనియర్ కళాశాలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన బిసి గురుకుల పాఠశాలల పాలక మండలి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 32 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ చదివే విద్యార్థుల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగానే జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలు పని చేస్తాయన్నారు. గురుకుల పాఠశాలల్లో పని చేసే తాత్కాలిక సిబ్బంది వేతనాలు పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ సంవత్సరం మంజూరు చేసిన పాఠశాలలను ప్రారంభించాలన్నారరు. సంవత్సరానికి 20 గురుకులాలను కొత్తగా మంజూరు చేయలాని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఐఐటి శిక్షణా తరగతులను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఐఐటి శిక్షణ కోసం బిసి విద్యార్థులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. బాలికల పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలన్నారు. బిసి విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. సంవత్సరానికి 1000 మంది విద్యార్థులను విదేశాలకు పంపాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో బిసి ఫెడరేషన్ ఎండి కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.