ఆంధ్రప్రదేశ్‌

ఎపి స్పోర్ట్స్ లీగ్‌కు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 3: రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఎపి స్పోర్ట్స్ లీగ్‌ను ఏర్పాటుచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఎపిఓఏ) సన్నాహలు చేస్తున్నట్టు ఎపిఓఏ కార్యదర్శి ఆర్‌కె పురుషోత్తం తెలిపారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో ఎపిఓఏ అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసమావేశంలో విబ్రి మీడియాతో ఎపిఒఎ స్పోర్ట్స్ లీగ్ నిర్వహణకు అవగాహనా ఒప్పందం (ఎంఒయూ) చేసుకున్నారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో పురుషోత్తం మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎపిఓఏ కృషి చేస్తోందన్నారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న లీగ్‌లకు ఏమాత్రం తీసిపోకుండా ఎపి స్పోర్ట్స్ లీగ్ నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. జాతీయక్రీడల నిర్వహణ బిడ్ దాఖలుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) నుండి రూ.4.50లక్షల చెక్కును అందుకున్నట్టు చెప్పారు. గతంలో రూ.50 లక్షలు చెల్లించారని, మిగిలిన మొత్తం ఎపిఓఏ నుండి చెల్లించాలని ఐఓఐ తెలపడంతో శాప్ నుండి ఆ మేరకు నిధులు వచ్చినట్టు తెలిపారు. ఎపిఓఏ ఉపాధ్యక్షులు కె పట్ట్భా మాట్లాడుతూ ఎపి స్పోర్ట్స్ లీగ్‌లో 175 నియోజక వర్గాలనుండి జట్లను ఎంపిక చేసి జిల్లాస్థాయి టోర్నీలు నిర్వహించి మొదటి మూడు స్థానాలు సాధించిన జట్లను రాష్టస్థ్రాయి టోర్నీకి పంపుతామన్నారు. వెయిట్‌లిఫ్టింగ్, హకీ, క్రికెట్, సాకర్, వాలీబాల్, బాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీ క్రీడాంశాల్లో లీగ్‌లు జరుగుతాయన్నారు. ఈసమావేశంలో ఎపిఓఏ కోశాధికారి కె పద్మనాభం, ఉపాధ్యక్షులు ఎ రమణారావు, ఎస్‌ఎం సుల్తాన్, బి వెంకట్రామయ్య, విబ్రి మీడియా చైర్మన్ విష్ణు, పాండురంగారావు, వేణు, శాప్ ప్రతినిధిగా డెప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.