ఆంధ్రప్రదేశ్‌

వైషమ్యాలు రెచ్చగొట్టవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: విభజిత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల పెట్టుబడుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరిందన్నారు. విశాఖ ఆర్కె బీచ్‌లో మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సులో ఎపి ప్రభుత్వం రూ.10.5 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టే క్రమంలో వెనుకంజ వేస్తాయని, అటువంటి పరిస్థితులు ఎపిలో ఉండకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వెల్లడించారు. పెట్టుబడులు వెల్లువెత్తితే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఇక్కడ శాంతియుత వాతావరణం ఉండాలని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం సహించలేని కొన్ని రాజకీయ శక్తులు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా పేరిట ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ ప్యాకేజీ పేరిట రూ.2.25 లక్షల కోట్ల ఆర్థిక సాయం రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నారన్నారు. విభజన సమయంలో పెగలని గొంతులు, ఇప్పుడు హోదా కోసం అశాంతిని ప్రేరేపిస్తున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎపిలో వచ్చే పదేళ్ల కాలంలో సంస్థలు నెలకొల్పాలని చట్టంలో చెప్పారని, ఎన్‌డిఎ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే అన్ని హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 32 అమృత్ పట్టణాలకు నిధులు మంజూరు చేశామని, మూడు నగరాలను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించామని తెలిపారు. ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యత ఎపికి ఇస్తున్నామని, ఈ విషయంలో కేంద్రం పరిమితులకు మించి పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.1.25 లక్షల కోట్లతో పెట్రోకారిడార్, రూ.లక్ష కోట్లతో రహదార్ల నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు కేంద్రం తీసుకుందన్నారు. ఇక భవిష్యత్‌లో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పనిచేస్తోందని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మన కీర్తిని పంచుదామని పిలుపునిచ్చారు. కేంద్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన సంస్కృతిని కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంతీయ సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. అంతకు ముందు విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌ను ప్రారంభించారు.