ఆంధ్రప్రదేశ్‌

లోకేశ్‌కు లైన్‌క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 3: తెలుగుదేశం ఉత్తరాధికారి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయ భవితవ్యంపై ఇప్పటివరకూ అనధికారికంగా జరుగుతున్న చర్చలు, అనుమానాలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరదించారు. ఆయనను క్యాబినెట్‌లో తీసుకుంటున్నట్టు తెలంగాణ పార్టీ నేతలకు స్పష్టం చేయడంతో లోకేశ్ ఇక క్యాబినెట్‌లోకి రావడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటివరకూ లోకేశ్ రాజకీయ భవితవ్యానికి సంబంధించి వివిధ రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఆయనను త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తీసుకుంటారని కొందరు, వచ్చే ఎన్నికల్లోనే అరంగేట్రం చేస్తారని మరికొన్ని వర్గాలు చర్చించాయి. ఆ మేరకు మీడియాలో కూడా భిన్నరకాల కథనాలు వెలువడ్డాయి. అయితే, తన భవిష్యత్తుకు సంబంధించి పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాత్రమే అటు యువనేత లోకేశ్ కూడా చెబుతూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబును కలిసిన తెలంగాణ టిడిపి నేతలు, లోకేష్ అవసరం తమ రాష్ట్రంలో పార్టీ శాఖకు ఉందని చెప్పారు. దానికి స్పందించిన బాబు.. లోకేష్‌ను ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని, అందువల్ల అక్కడ పూర్తి సమయం కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కీలకమైన అంశాలు, సమస్యలపై ఎలాగూ తాను,లోకేశ్ మాట్లాడుతున్నందున అదే విధానం కొనసాగిద్దామని చెప్పడంతో టిటిడిపి నేతలు నిరాశకు గురయ్యారు. నాయకుల మధ్య సమన్వయం లేక బలహీనంగా ఉన్న టిటిడిపికి, లోకేశ్ స్వయంగా మార్గదర్శకం చేస్తే పార్టీ బలపడుతుందన్నది తెలంగాణ పార్టీ నేతల భావన. బాబు సంకేతాలతో లోకేశ్ క్యాబినెట్‌లోకి రావడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా వస్తారా? లేక ఎమ్మెల్యేగా ఎన్నికవుతారా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలయింది. తొలుత ఆయనకు ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, యువకుడైన లోకేశ్ ఈ వయసులో పెద్దల సభకు వెళ్లడం వల్ల ఇమేజ్ పోవడంతోపాటు, పోటీ చేసే ధైర్యం లేక ఎమ్మెల్సీగా వెళ్లారంటూ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టవుతుందనే వాదన కూడా జరిగింది. దానితో ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చకు తెరలేచింది. ప్రస్తుత ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆ మేరకు తాను రాజీనామా చేసేందుకూ సిద్ధమవుతున్నారు. విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరులో తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు, కమ్మ సామాజికవర్గం ప్రభావం కూడా ఉండటంతో లోకేశ్ గెలుపు నల్లేరు మీద నడకేనని పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. అక్కడ వైసీపీ కూడా బలహీనంగా ఉన్నందున ఆయనకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చంటున్నారు. పైగా రాజధాని నగరమైనందున, విజయవాడ-కృష్ణా జిల్లాలో ఎడమొఖం-పెడమొఖంగా ఉన్న నాయకుల మధ్య ఉన్న కుమ్ములాటలు కూడా తగ్గి, లోకేశ్ పర్యవేక్షణ ఉన్నందున భయభక్తులు పెరుగుతాయని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు.