ఆంధ్రప్రదేశ్‌

కమనీయం మహాక్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 3: ఆరోగ్యం..ఐశ్వర్యం..నేత్రానందం..ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి మహాక్షీరాభిషేక దర్శనం! సూర్యజయంతి పర్వదినం పురస్కరించుకుని ఆదిత్యుని మూలవిరాట్‌కు భక్తుల క్షీరాభిషేక సేవలు చూసిన నయనాలే నయనాలు. ఏడాదికోసారి రథసప్తమి పర్వదినాన సూర్యభగవానుని నిజరూపదర్శనం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగించి పరవశింపజేసే ఘట్టం ఈ శుభ సమయం. శుక్రవారం మధ్యంతరంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణస్వామి స్వరూపమైన అమ్మవార్లతోకలిసిన ఆదిత్యునికి ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో అర్చక బృందాలు వేదమంత్రాలతో నమక, చమక, పురుష, స్ర్తి సూక్త మహన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు చేశారు. శుక్రవారం శ్రీమాత సన్నిధిగా శ్రీ చక్రరాజనిలయా శ్రీ ఆదిత్యాయా..అంటూ స్వామివారిని కొనియాడుతూ వేదమంత్రాలను పఠిస్తూ ఆలయంలో మరింత శోభ చేకూర్చారు. సూర్యజయంతి(రథసప్తమి) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మాఘశుద్ధ సప్తమి ఘడియల్లో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తొలి అభిషేకం, పూజలతో సూర్యజయంతి మహోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.శ్యామలాదేవి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకులకు హాజరైన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మట్లాడుతూ దేశంలోనే అరుదైన దేవాలయం ఇక్కడ ఉండడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ఆరోగ్యప్రదాత రాష్ట్రప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా చూడాలని ఆదిత్యున్ని ప్రార్ధించారు. ఈ వేడుకల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం జెడ్పీ చైర్‌పర్సన్‌లు చౌదరి ధనలక్ష్మీ, లాలం భవానీ, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందరశివాజీ, కంబాల జోగులు, వి.కళావతి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, జిల్లా జడ్జి వి.బి.నిర్మలాగీతాంబ, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కుటుంబ సభ్యులతో ఆదిత్యున్ని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి ఆశీస్సులతో అనందమయ దర్శనం చేసుకున్నారన్నారన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

చిత్రం..ఆదిత్యునికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి,
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి