ఆంధ్రప్రదేశ్‌

పవన్-జగన్ పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ప్రతిపక్ష నేత పాత్రపై పోటీ మొదలయింది. ఇప్పటివరకూ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీపై ఒంటరి పోరాటం చేస్తున్న నేపథ్యంలో కొత్తగా జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ తెరపైకి రావడంతో పాటు ప్రజల మధ్యకు వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవడంతో ఇద్దరు నాయకుల మధ్య పోటీ పెరిగినట్టయింది. ఫలితంగా ఇప్పటివరకూ ప్రతిపక్ష నేత అంటే జగన్ ఒక్కరేనన్న భావన స్థానంలో, ఇకపై పవన్ కూడా ఉంటారనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పోటీకి తెరలేచింది. ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో పవన్‌కు మైలేజీ దక్కకుండా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పవన్‌కల్యాణ్ ఫలానా అంశంపై తాను వస్తాననో, లేదా ఫలానా తేదీన బహిరంగ సభ నిర్వహిస్తాననో ప్రకటించిన వెంటనే వైసీపీ రంగంలోకి దిగి, ఆయన కంటే ముందే అదే జిల్లాలో జగన్ సభలు జరిగేలా చూస్తున్నారు. పవన్ స్పందించిన అంశాలనే తీసుకుని వైసీపీ నేతలు స్వయంగా అక్కడికి వెళుతున్నారు. ఈవిషయంలో ఒకరకంగా పవన్ వైస్సార్‌సీపీకి పని కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా పవన్ ఏ సమస్యపై స్పందించారో తామూ అలాంటి సమస్య ఉన్న మరో జిల్లాను ఎంచుకుని దానిపై పోరాడటం ద్వారా పవన్‌కు పొలిటికల్ మైలేజీ రాకుండా వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పవన్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలు లేవనెత్తిన వెంటనే జగన్ రంగంలోకి దిగి ప్రకాశం జిల్లాలో అదే సమస్యలతో బాధపడుతున్న రోగుల వద్దకు వెళ్లారు. అమరావతి లంక భూముల బాధితుల సమస్యలపై పవన్ గళం విప్పిన వెంటనే జగన్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. తాజాగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ని అవుతానన్న పవన్, అందులో భాగంగా తొలిదశలో గుంటూరు జిల్లా మంగళగిరికి ఈ నెల 20న వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈవిషయం తెలిసిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 16న గుంటూరులో యువభేరి నిర్వహించాలని నిర్ణయించారు. పేరు యువభేరి అయినప్పటికీ అందులో ఎక్కువగా చేనేత సమస్యలే ఉంటాయన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రానికి హోదా విషయంలోనూ పోటాపోటీగా వ్యవహరిస్తోన్న జగ న్-పవన్ వ్యవహారశైలి పరిశీలిస్తే ఇద్దరూ ప్రతిపక్ష పాత్రకు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే జగన్‌కు పొలిటికల్ మైలే జీ రాకుండా అడ్డకునేందుకు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచించడం లేదని పవన్ వ్యవహారశైలి స్పష్టచేస్తుండగా, వైసీపీ అడుగులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలినా తమ పరాజయం ఖాయమన్న ముందుజాగ్రత్తతో ఇప్పటినుంచే పవన్‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అందుకే హోదా విషయంలో కలసి పనిచేద్దామని పవన్ ప్రతిపాదించి వారం రోజులైనా ఇప్పటివరకూ వైసీపీ నుంచి స్పందన కనిపించలేదు. దానికి సమాధానం చెప్పకుండా, బడ్జెట్‌లో ఏపికి జరిగిన అన్యాయంపై పవన్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. దీన్నిబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నేత పాత్ర కోసం రాజకీయ పోరు మొదలయినట్లు స్పష్టమవుతోంది.