ఆంధ్రప్రదేశ్‌

గళమెత్తనున్న మహిళా శక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సదస్సులను తలదనే్నలా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయిస్తోంది. ఈమేరకు అధికారులు శ్రమిస్తున్నారు. కృష్ణానదీ తీరం ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరిగే సదస్సుకు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమాజంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో స్ఫూర్తి కలిగించి, వారిలో చైతన్యం తేవాలని సంకల్పించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి దాదాపు 9వేల మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య 14 వేలకు చేరే అవకాశం వుందని భావిస్తున్నారు. వీరిలో అత్యధికులు విద్యార్థినులు ఉంటారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో చైర్మన్‌గా శాసనసభాపతి కోడెల, చీఫ్ పేట్రన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేట్రన్‌గా ప్రముఖ గాంధేయవాది ఈలాభట్, కన్వీనర్‌గా ప్రముఖ విద్యావేత్త రాహుల్ వి. కరద్ సదస్సును నిర్వహిస్తున్నారు.
సదస్సుకు హాజరైన మహిళలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అన్ని మతాలు, ప్రాంతాలు, కులాలు, సంస్కృతులు, వివిధ సామాజిక వర్గాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలంతా సదస్సుకు హాజరవుతారు. రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ వ్యవస్థల నుంచి మహిళలతో పాటు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొని వారి అనుభవాలను తెలియజేస్తారు. రాజకీయ, పారిశ్రామిక, విద్యా, పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఎదుగుదలకున్న అవకాశాలను చర్చిస్తారు. దేశం సుసంపన్నం కావడానికి మహిళా శక్తిని ఏవిధంగా వినియోగించాలి? వంటి అంశాలపై కూడా ప్రసంగిస్తారు. జాతీయస్థాయిలో మహిళలు ఎదుర్కొనే రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు చర్చించి, వాటిని అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలు, విధివిధానాలు రూపొందిస్తారు. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ ప్రతినిధులతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన మహిళలు కూడా సదస్సుకు హాజరవుతారు. దేశం నలుమూలల నుంచి 405 మంది మహిళా శాసనసభ్యులు, 92 మంది మహిళా పార్లమెంట్ సభ్యులు, కార్పొరేట్ సంస్థల నుంచి 3 వందల మందికి పైగా మహిళా ప్రతినిధులు, 8వేల నుంచి 10వేల మంది వరకు విద్యార్థినులు హాజరవుతారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే అవకాశం వుంది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనసభాపతి కోడెల, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, రవిశంకర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ అక్బర్ ఖాన్, యుపిఎస్సీ మాజీ చైర్‌పర్సన్ ఆల్కా సిరోహి, ఎమ్మెల్యే అఖిలప్రియ, అనిత, భారత సంతతికి చెందిన మేరిల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్ సభ్యురాలు అరుంధతి భట్టాచార్య, క్రీడాకారిణులు అరుణిమా సిన్హా, పివి సింధు, మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ, ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్, చందాకొచ్చర్, భావనా దోషి, దీపా వెంకట్, ఈలా బెన్ భట్, లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్ సన్ సిర్లీఫ్, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా, హెచ్‌ఎస్‌బి క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ గణేష్ నటరాజన్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, ప్రొఫెసర్ హరిదాస్, సచిన్ టెండూల్కర్, ఇందిరాదత్, ఇంద్రనూయి, మనిషాకోయిరాల, జూహీచావ్లా, ఎంపి కల్వకుంట్ల కవిత, కిరణ్ మజుందార్ షా, కిరణ్ బేడీ, లతామంగేష్కర్, లలితా కుమారమంగళం, లక్ష్మీ అగర్వాల్, నారా బ్రాహ్మణి, నోబెల్ ప్రైజ్ విజేత ప్రొఫెసర్ ముహ్మద్ యూనస్, సుధామూర్తి, పద్మశ్రీ వారియర్, సోనాల్ మాన్ సింగ్, సీమారావు, శైలజాకిరణ్, నందితాదాస్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరాని, కవితా జైన్, పూసపాటి అశోక్‌గజపతిరాజు, వైఎస్ చౌదరి, రాష్ట్ర మంత్రి పీతల సుజాతలతో పాటు దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించే అవకాశం వుంది.
మూడురోజులు 7 విభాగాలుగా జరిగే సదస్సులో వివిధ రంగాలకు చెందిన 60 మంది నిష్ణాతులు తమ విలువైన సందేశాలిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు వస్తున్నందున ఆ స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సదస్సు జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం..ఏర్పాట్లపై వివరాలు తెలుసుకుంటున్న శాసనసభాపతి కోడెల