ఆంధ్రప్రదేశ్‌

గణతంత్ర పరేడ్‌లో విహెచ్‌పి కార్యకర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5:ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరెడ్‌లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారని, ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతికి ఫిర్యాదు చేసింది. జనవరి 26న జరిగిన పరెడ్‌లో విహెచ్‌పి కార్యకర్తలు పాల్గొన్నా, రాష్ట్రప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని రాష్టప్రతికి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్‌ల మధ్య ఏర్పడిన స్నేహంతో ఎలాంటి చర్య తీసుకోలేదని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు తెలిపారు. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మతతత్వవాదులకు ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. విహెచ్‌పికి చెందిన అధికారిక జెండాతోనే వాళ్లు పరేడ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఈ అంశంపై తగిన చర్య తీసుకోవాలని రాష్టప్రతిని పిసిసి అధ్యక్షుడు కోరారు. ఈ అంశంపై చర్య తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు.