ఆంధ్రప్రదేశ్‌

మలద్వారంలోకి బీరుబాటిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 9: ఓ వ్యక్తి మలద్వారంలోకి బలవంతంగా ఖాళీ బీరుబాటిల్ జొప్పించిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరంలో శనివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన కమరుద్దీన్‌ఖాన్(45) గజపతినగరంలో రైల్వే ట్రాక్‌మిషన్‌లో పనిచేసే సిబ్బంది వద్ద వంటమనిషిగా చేరాడు. 15 రోజుల క్రితం ఇతడు గజపతినగరం వచ్చాడు. శనివారం తెల్లవారుజామున విరేచనాలు కావడంతో రెండుసార్లు బహిర్భూమికి వెళ్లాడు. మూడోసారి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని ఆరుగురు సాయుధ వ్యక్తులు అడ్డుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. చేతిలో తుపాకులు, మోకాళ్ల వరకు బూట్లు ధరించి ఉన్నవారు హిందీలో మాట్లాడారు. ఏం జరిగిందని కమరుద్దీన్‌ఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక విరేచనాలు కావంటూ కమరుద్దీన్ రెండు చేతులు వెనక్కి విరిచికట్టి బలవంతంగా మలద్వారంలోకి ఖాళీ బీరుబాటిల్ జొప్పించి వెళ్లిపోయారు. తీవ్ర నొప్పితో విలవిల్లాడిన ఖాన్ బాటిల్ తొలగించేందుకు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. చాలా సేపటి వరకు సిగ్గుతో ఎవరితో చెప్పుకోలేకపోయాడు. తీవ్ర రక్తస్రావం, నొప్పి ఎక్కువ కావడంతో సహచర సిబ్బందికి జరిగింది చెప్పాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఖాన్‌ను ప్రథమ చికిత్సకోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విజయనగరం ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. వచ్చినవారు నక్సలైట్లు అయి ఉంటారని బాధితుడు ఆరోపిస్తున్నారు.