ఆంధ్రప్రదేశ్‌

రేషన్ షాపుల్లో రాగులు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఫిబ్రవరి 5: ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పించి రేషన్ షాపుల్లో రాగులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. మంత్రి సునీత ఆదివారం అనంతపురం జిల్లా రామగిరిలో ఓ చౌకధాన్యం డిపోలో రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాగులు పంపిణీకి పైలెట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లాను తీసుకుని అందులో 5 మండలాలను ఎంపిక చేశామన్నారు. అందులో భాగంగా ప్రప్రథమంగా రామగిరి మండలంలో రాగులు పంపిణీ చేశామన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం బదులు 3 కిలోల రాగులు కిలో రూ. 1తోనే అందిస్తున్నట్లు తెలిపారు. అయితే రాగులు తీసుకోవడం తప్పనిసరి కాదని, ఇష్టం ఉన్న వారు మాత్రమే తీసుకోవచ్చు లేకపోతే లేదని తెలిపారు. చౌకధాన్యం డిపోలో రాగులు కొనుగోలు చేసి బయట అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.