ఆంధ్రప్రదేశ్‌

నిర్విరామంగా కూచిపూడి నృత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 510 మంది కళాకారులు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్విరామంగా కూచిపూడి నృత్యప్రదర్శనలతో హోరెత్తించారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం అన్నమాచార్య పద నృత్యాంజలికి వేదికైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నృత్య ప్రదర్శనలు కొనసాగాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జ్యోతి ప్రజ్వలన చేసి నృత్య ప్రదర్శనలను ప్రారంభించారు. 510 మంది నిర్విరామంగా కూచిపూడి శాస్ర్తియ నృత్యాన్ని ప్రదర్శించారు. రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి, ఆర్టీసీ ఎండి ఎం మాలకొండయ్య, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు లలితారావు, ఎబిసి ఫౌండేషన్ అధ్యక్షుడు కెవి రమణారావు తదితరులు పాల్గొన్నారు.