ఆంధ్రప్రదేశ్‌

పాలారు నది చెక్‌డ్యాం ఎత్తు పెంచొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఫిబ్రవరి 5: కుప్పం నియోజకవర్గంలో ప్రవహిస్తున్న పాలారు నదిపై ఉన్న చెక్‌డ్యాం ఎత్తు పెంచవద్దంటూ తమిళులు ఆదివారం సరిహద్దుల్లో ధర్నా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కుప్పం నియోజకవర్గం మీదుగా తమిళనాడు రాష్ట్రానికి ప్రవహించే పాలారు నదిపై సుమారు 20 సంవత్సరాల క్రితం 32 చెక్‌డ్యాంలు నిర్మించారు. ఇది జీవనది కాకపోయినప్పటికీ చెక్‌డ్యాంల నిర్మాణం పటిష్ఠంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం వాటిపై మరో రెండు అడుగుల ఎత్తు నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణాలు పూర్తయి దాదాపు సంవత్సరం పూర్తవుతుండగా చెక్‌డ్యాంలపై నిర్మాణం చేపట్టకూడదని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళ వాల్ ఉరమై కచ్చి ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని పెద్దవంక వద్ద ధర్నా చేపట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అనుమతి లేకపోయినప్పటికీ వారు రాష్ట్రంలోకి చొరబడేందుకు విఫలయత్నం చేయడంతో తమిళ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర సరిహద్దుల్లో ఉదయం నుంచి భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు.