ఆంధ్రప్రదేశ్‌

పోలీసులు వ్యాయామం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 6: పోలీసు సిబ్బందికి వ్యాయామం తప్పనిసరని, అది హోం మంత్రి చినరాజప్పతోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. సోమవారం గుంటూరులో మోడల్ పోలీస్టేషన్ ప్రారంభోత్సవ సభలో ఆయన ఛలోక్తులు విసిరారు. అధికారులు, సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమన్నారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యే సమయంలో మాత్రమే ఫిట్నెస్ పోటీలు నిర్వహిస్తున్నారని, ఉద్యోగాల్లో చేరిన తరువాత కూడా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రానున్న కాలంలో పోలీసులంతా ఆనందంగా, ఉల్లాసంగా, స్మార్ట్‌గా ఉండాలని చెప్పారు. యాంత్రికంగా పనిచేసే అలవాటు మానుకుని అధునాతన టెక్నాలజీని, రియల్‌టైమ్ రికార్డును ఆకళింపు చేసుకోవాలన్నారు. ‘సామాన్యులకు పోలీస్టేషన్లు రక్షణ కల్పించాలి.. సత్వర న్యాయం అందించేందుకు మోడల్ పోలీస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా విధులు నిర్వహిస్తే మీ కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మానసిక ఒత్తిళ్లు, అశాంతి వల్లే అలజడులు చెలరేగుతాయని చెప్పారు. పోలీసింగ్ అనేది సున్నితమైన సమస్య అని, ముఠాకక్షలు, రౌడీయిజం, అల్లర్లు, భూకబ్జాలను అరికట్టటంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలని, ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా క్షేమంగా ఇంటికి తిరిగొస్తుందనే భావన తల్లిదండ్రుల్లో కలగాలని, ఇందుకు పోలీసు శాఖ ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు కూడా సానుకూల దృక్పథంతో సహకరించాలని కోరారు. అంతకుముందు విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు ‘ఈ పోలీస్టేషన్లు మీకోసమే అని ప్రసంగాన్ని ప్రారంభించి అంతలోనే తేరుకుని, మీ భద్రతకోసమం’టూ సవరించుకున్నారు. రాజకీయ నేతలు ఒకానొకప్పుడు పోలీసులను పరుష పదజాలంతో దూషించేవారని, అయితే ఇప్పుడు బాడీ ఓర్న్ కెమెరాల్లో బంధించడం ద్వారా ఎంతటి వారినైనా శిక్షించే వీలు కలుగుతోందని వివరించారు. ద్రోన్, సిసి కెమెరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించ గలుగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.