ఆంధ్రప్రదేశ్‌

ఆరోపణలు రుజువైతే పిఏపై క్రమశిక్షణ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 6: తన వ్యక్తిగత కార్యదర్శి శేఖర్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపై హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఈ విషయం నియోజకవర్గంలోని అధికార పార్టీలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత కార్యదర్శి మీద వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని బాలకృష్ణ తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అధిష్ఠానం ముందు తనతో పాటు అందరూ సమానమేనని అన్నారు. ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా అధిష్ఠానం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.