ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పదవికి లోకేష్ అర్హుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి పదవికి అన్నివిధాలా అర్హుడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. దీనిపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఖండించారు. మంత్రి శిద్దా సోమవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ యువకుడు, విద్యావంతుడైన లోకేష్ మంత్రివర్గంలో చేరడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి 63 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా చేర్పించారన్నారు. రూ.2లకే 20 లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల పథకాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. 2014 జూన్ నుంచి నేటివరకు దాదాపు 90వేల మంది కార్యకర్తలను స్వయంగా కలిసి పార్టీ అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు సేకరించారన్నారు. దేశంలో మొట్టమొదటిగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి ప్రమాదంలో గాయపడిన, మరణించిన కార్యకర్తల కుటుంబాలకు కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. వారంలో 3 నుండి 4 రోజులు గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుంటున్నారన్నారని తెలిపారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగినవిధంగా బుద్ధి చెప్పారని, వారు తమ ఉనికిని కాపాడుకోవటం కోసమే విమర్శలు చేస్తున్నారని మంత్రి శిద్దా విమర్శించారు.