ఆంధ్రప్రదేశ్‌

గోమూత్రంతో రోగాలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 6: గోమూత్రం ద్వారా అనేక రోగాలు దూరం అవుతాయని, ప్రతివొక్కరు ఇంట్లో కారు షెడ్లకు బదులుగా గోవుషెడ్లు నిర్మించుకోవాలని విజయవాడ సమీపంలోని తాళ్ళాయపాలెం శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ రక్షా సమిడి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్‌లో సోమవారం రాత్రి 5వ లక్ష గోపిడకల యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ శివస్వామీజీ ప్రారంభించారు. ముందుగా గోమాతకు పూజలు నిర్వహించి, లక్ష పిడకల యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోసేవ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రవచించారు. అంతరించిపోతున్న గోసంపదను పరిరక్షించుకుని, తద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు కృషిచేయాలని హితవు పలికారు. గోవుకు మన పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యతలున్నాయన్నారు. గోవు విష పదార్ధాలు స్వీకరించినప్పటికీ ఏ విధమైన కల్తీ లేని, స్వచ్ఛమైన అమృతం వంటి క్షీరాన్ని మనకందిస్తోందని స్వామీజీ అన్నారు. గోవులను పోషించే అవకాశం లేనివారు వాటిని సంరక్షించేవారికి కనీసం సహకరించాలని కోరారు. గోవులను కబేళాలకు తరలించే వారు రుణగ్రస్తులవుతారని, అనారోగ్యాలను కొనితెచ్చుకుంటారని హెచ్చరించారు. ప్రతివొక్క హిందువు కనీసం ఒక గోవును పరిరక్షించాలని స్వామీజీ సూచించారు.

చిత్రం..కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శివస్వామీజీ