ఆంధ్రప్రదేశ్‌

రానున్న ఏడాదే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 6: రానున్న ఏడాది కాలం ప్రభుత్వానికి ఎంతో కీలకమని, సామాన్యుడు సంతృప్తి చెందేలా ప్రజారంజక పాలన అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనుభవం, వనరులు, సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికే నాయకత్వం వహించే స్థాయికి ఎదిగేలా చేయాలని, దీనికోసం ప్రభుత్వ శాఖలన్నీ పట్టుదలగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జవాబుదారీతనం పెంపొందించుకోవాలని అధికారులకు నిర్దేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆయన సమావేశం నిర్వహించారు. 2017-18 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ ఆశించిన ఫలితాలు రాబట్టేదిగా ఉండాలనే ఆకాంక్షను ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు మొదలైందని, సుస్థిర వృద్ధి, విజన్ 2029, జీవిఏ, కుటుంబం - సమాజ వికాసం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందుతుందన్నారు. సంపన్నులు - సామాన్యుల మధ్య అంతరాలను తొలగించే బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. మరో మూడురోజుల్లో శాఖాలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలన్నారు. తరువాత మరోమారు సమావేశం నిర్వహించి అవసరమైతే నిపుణులతో చర్చించి ప్రాధాన్యాలు నిర్ణయిద్దామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రణాళిక - ప్రణాళికేతర పద్దుల కింద విభజించకుండా తొలిసారిగా వినూత్న విధానంలో ప్రవేశపెట్టడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. రాష్ట్రాల వారీ కేటాయింపులకు ముగింపు పలికి ఈసారి కొత్తగా శాఖలవారీ నిధులు ఇవ్వడం ప్రత్యేకతగా వర్ణించారు. జీఎస్టీతో రానున్న రోజుల్లో ఆదాయం పెరుగుతుందని, స్నేహపూర్వక వ్యాపారానికి అనువుగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. క్రమంగా ఆన్‌లైన్ లావాదేవీల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, ఆన్‌లైన్ లావాదేవీల వల్ల పట్టణ ప్రాంతాల్లో పన్ను ఆదాయం క్రమంగా పెరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర సహాయ పథకాల కింద నిధులను సమర్థంగా, సంపూర్ణంగా అందిపుచ్చుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖలు నేరుగా కేటాయించే నిధుల్లో అగ్రభాగం రాష్ట్రానికే దక్కేలా అవగాహన పెంచుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాలకు రహదారులు వేసే ప్రాజెక్టు కింద నిధులు పెద్దఎత్తున పొందేందుకు అవసరమైతే ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం రోడ్లు భవనాలు, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రెండంకెల వృద్ధి సాధించామని, విద్యుత్ రంగంలో తీసుకున్న చర్యల కారణంగా మిగులు స్థాయికి చేరుకోగలిగామన్నారు. నిధుల ఏకీకరణ, జవాబుదారీతనం, వనరుల వినియోగం కలిసొచ్చే అంశాలన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ సుస్థిర వృద్ధి సాధించే అవకాశం ఉందని చెప్పారు. దీనికి సానుకూల నిర్ణయాలే కారణమన్నారు. 10 లక్షల పంట కుంటలు తవ్వించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యంలో 40 శాతం రాష్టమ్రే సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం, రైల్వేజోన్ ఇవ్వడం, రెవెన్యూ లోటు భర్తీచేయడం వంటివాటిని కేంద్రంగా ఇంకా నెరవేర్చాల్సి ఉందన్నారు. వచ్చే రెండు, మూడు ఏళ్లలో అన్ని గ్రామాల్లో ఉత్తమ వౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. మన పల్లెల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల్ని పారదోలడమే అజెండా కావాలన్నారు. భూమిలేని నిరుపేదలకు పశుసంపద ద్వారా ఆదాయం పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. వృద్ధికి విస్తృతావకాశాలు ఉన్న సేవల రంగానికి ప్రోత్సాహం అందిస్తే ఆశించిన ఫలితాలు సత్వరం వస్తాయని తెలిపారు.