ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా శారదా పీఠం వార్షికోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: గత ఐదు రోజులుగా జరుగుతున్న విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్వీయ పర్యవేక్షణలో జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్నిహోత్రులను, శ్రౌత పండితులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అగ్నిహోత్ర పండితుల తరపున దెందుకూరి వెంకటేశ్వర ఘనాపాఠి యాజిని శ్రౌతభాస్కర అనే బిరుదు ప్రదానం చేశారు. అలాగే స్వర్ణ కంకణంతో సత్కరించారు. శ్రౌత పండితుల తరపున తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ దేవానందంను వేదాంత శ్రౌతభాస్కర అన్న బిరుదుతో, స్వర్ణ కంకణంతో సత్కరించారు. తైత్తిరియోపనిషత్ అనే గ్రంథాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి వేదాంత భాష్యం చేశారు. దానిని పుస్తకంగా మలచి పుస్తకావిష్కరణ చేశారు. ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన బ్రహ్మశ్రీ చాగంటి ప్రకాశరావును దుశ్శాలువతో స్వామి సత్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అనుగ్రహ భాషణం చేస్తూ, ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి శాస్త్ర, శ్రౌత పండితులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అనేక విషయాలపై ఇక్కడ చర్చించడం శుభదాయకంగా ఉందని అన్నారు.
పండితులు వివిధ గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో సదస్సులు పెట్టి అగ్నిహోత్రాది కర్మల వలన వచ్చే ఫలాలు, భగవంతుని చేరుకునే మార్గాన్ని ప్రజలకు వివరించాలని ఆకాంక్షించారు. తను గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, భగవంతుని గురించి వారు పడే ఆర్తిని చూసి ముగ్థుడనవుతున్నానని మహాస్వామి చెప్పారు. భక్తుల్లోని చైతన్యశక్తిని మేల్కొలిపి, తత్వాన్ని తెలిపే పండితులు తయారు కావాలని, అలాంటి పండితులను శారదాపీఠం దత్తత తీసుకుంటుందని స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే కోన రఘుపతి, టి- ఎమ్మెల్సీ సుధాకరరెడ్డి హాజరయ్యారు.

చిత్రం..అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న స్వరూపానందేంద్ర