ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎటువంటి చెల్లింపులను చేయవద్దని అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాలకు వౌఖిక అదేశాలను బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెక్యూరిటీ బాండ్లను రిజర్వు బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ 1.34 లక్షల కోట్ల రూపాయలతో రూపొందించినప్పటికీ, ఇప్పటివరకూ దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ద్రవ్యలోటు 24వేల కోట్ల రూపాయలకు చేరుకోగా, రెవెన్యూ లోటు దాదాపు 15వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. కేంద్రం నుంచి దాదాపు 16వేల కోట్ల రూపాయలు ఇంకా వివిధ పద్దుల కింద విడుదల కావాల్సి ఉంది. వివిధ విభాగాలు 26వేల కోట్ల రూపాయల మేర అదనంగా నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా ఖజానాపై తీవ్ర ప్రభావం చూపింది. రిజిస్ట్రేషన్లు దాదాపు నిలిచిపోవడంతో ఈ ఏడాది లక్ష్యాలను 50 శాతానికి మించి అధిగమించలేని పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు 1000 కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని శాఖలు అడ్వాన్సు చెల్లింపులను భారీగా చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖజానాకు ఆశించిన రాబడి లేకపోవడంతో బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో 13 జిల్లాల్లోని అన్ని ట్రెజరీల్లో బిల్లులను చెల్లించవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిలిపివేయమని వౌఖిక ఆదేశాలను జారీ చేసింది. బ్యాంక్‌లకు పంపిన బిల్లులను సైతం చెల్లించవద్దని చెప్పడం గమనార్హం. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కెందుకు ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను ఆర్‌బిఐ వద్ద తనఖా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌ఎంబి పరిమితిని 4 శాతానికి పెంచమని కేంద్రాన్ని రాష్ట్రం కోరడం తెలిసిందే. దీని వల్ల రాష్ట్రం రుణం పొందే పరిమితి కొంచెం పెరుగుతుంది. కాగా ట్రెజరీ చెల్లింపులను నిలిపివేయడం వల్ల వివిధ స్కాలర్‌షిప్‌లు, ఆసుపత్రులు, సంక్షేమ హాస్టళ్ల మెస్ బిల్లుల చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితి మరో ఐదు రోజులు కొనసాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మార్చి నెలలో బిల్లుల చెల్లింపులపై ట్రెజరీ ఆంక్షలు ఉంటుంటాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ పరిస్థితి నెలకొనడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియచేస్తోందనవచ్చు.